Crime news: అమ్మ కోసం కన్యత్వం అమ్మకానికి.. ముగ్గురి అరెస్ట్‌

కన్నతల్లి క్యాన్సర్‌ చికిత్సకు డబ్బుల్లేక విధిలేని పరిస్థితుల్లో ఓ పదకొండేళ్ల బాలిక తను అంగడిసరకుగా మారడానికి సిద్ధమైంది. ఐదువేల

Published : 03 Oct 2021 01:16 IST

నాగ్‌పూర్‌: కన్నతల్లి క్యాన్సర్‌ చికిత్సకు డబ్బుల్లేక విధిలేని పరిస్థితుల్లో ఓ పదకొండేళ్ల బాలిక తను అంగడిసరకుగా మారడానికి సిద్ధమైంది. ఐదువేల రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. హృదయవిదారకమైన ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ బాలిక ఆ రొంపిలోకి దిగకముందే పోలీసులు ఆమెను రక్షించారు. చిన్నారిని ఒత్తిడి చేసి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. ఆమె కోసం రూ.40వేలు చెల్లించడానికి సిద్ధమైన విటుడే బాలిక దీనగాథకు చలించి ఇన్‌ఫార్మర్‌గా మారడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం బాధిత బాలిక తల్లి కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి అవసరాన్ని పొరుగున ఉండే అర్చనా వైశంపాయన్‌ (39) పసిగట్టింది. మాయమాటలు చెప్పి బాలిక కన్యత్వానికి రూ.5వేలు వెల కట్టేలా ఒప్పించి, తనతో పంపమంది. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఒప్పుకుంది. అర్చనతోపాటు రంజనా మెష్రామ్‌ (45), కవితా నిఖారే (30)లు ఓ వ్యక్తితో రూ.40వేలకు బేరం కుదిర్చారు. కానీ బాలికను ‘కొనుగోలు’ చేసిన విటుడే జాలిపడి ఓ స్వచ్ఛంద సంస్థకు ఉప్పందించాడు. ఆ సంస్థ సోషల్‌ సర్వీస్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఎస్‌బీ) పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు