Delhi: ఒక హత్య.. 300 సీసీ కెమెరాలతో ఛేదించి..

ఒక హత్య కేసును ఛేదించడం కోసం పోలీసులు 300 సీసీ కెమెరాలను పరిశీలించి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు.

Published : 05 May 2022 01:48 IST

దిల్లీ: ఒక హత్య కేసును ఛేదించడం కోసం పోలీసులు 300 సీసీ కెమెరాలను పరిశీలించి  నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన రామ్‌ కిశోర్‌ అగర్వాల్‌ అనే బిల్డర్‌ మృతదేహాన్ని అతని నివాసంలో పోలీసులు గుర్తించారు. ఆయన గొంతు, శరీరంపై కత్తి పోట్లు ఉన్నాయి. అతని ఇంట్లోని డబ్బు దొంగిలించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో దొంగతనానికి వచ్చిన దుండగులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు మృతుడి ఇంటి సమీపంలోని 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. దిల్లీ మెట్రో స్మార్ట్‌లపై నిఘా పెట్టి, మెట్రో సిబ్బందితో కలిసి సంయుక్తంగా చర్యలు తీసుకున్నారు.

హత్య జరగడానికి రాత్రి నిందితులు ఒక బైక్‌ను దొంగతనం చేసి దానిని మృతుడి ఇంటి ముందు పార్కు చేసినట్లు సీసీ కెమెరాలో పోలీసులు గమనించారు. దీంతో పోలీసులు మెట్రోలో నిందితుల కదలికలను ట్రాక్ చేసి అక్కడి అధికారులను, సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. నిందితుల మెట్రో స్మార్ట్ కార్డ్‌పై నిఘా ప్రారంభించారు. దాని ఆధారంగా ట్రాక్‌ చేసి రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బిల్డర్‌ ఇంట్లో క్లీనర్‌గా పని చేసిన వాళ్లే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు బీహార్‌కి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు వారిలో ఒకరు మైనర్‌ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని