Crime news: బురుండి జైలులో మంటలు.. 38మంది ఖైదీలు మృతి!

తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండిలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని జితేగా జైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ....

Updated : 08 Dec 2021 16:30 IST

జితేగా: తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండిలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని  జైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి పూట ఖైదీలంతా నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 38మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. మరో 69మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జైలులో ఖైదీలు మంటల్లో కాలిపోయారు.. క్షతగాత్రుల్ని పోలీసులు, సైన్యం ట్రాక్టర్లలో ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ ఓ ప్రత్యక్ష సాక్షి ఫోన్‌లో చెప్పినట్టు ఏఎఫ్‌పీ మీడియా సంస్థ పేర్కొంది. అయితే, ఈ మంటలు చెలరేగడానికి కారణాలేంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

అయితే, భారీగా ఎగసి పడుతున్న మంటలను చూసి కేకలు పెట్టినా.. పోలీసులు తమ క్వార్టర్స్‌ తలుపులు తీసేందుకు నిరాకరించారని ప్రత్యక్షసాక్షిగా ఉన్న ఖైదీ పేర్కొన్నట్టు ఆ మీడియా సంస్థ తెలిపింది. సమాచారం అందుకున్న రెడ్‌ క్రాస్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందిస్తున్నారు.  మరోవైపు, ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రోస్పెర్‌ బజోంబాంజాతో పాటు కొందరు మంత్రులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు