
అరాచకం: సిగరెట్లు తీసుకున్నారు.. డబ్బులు అడిగితే కొట్టి చంపారు!
షాహ్డోల్: మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్ జిల్లాలో నలుగురు వ్యక్తులు అరాచకానికి పాల్పడ్డారు. ఓ దుకాణంలో సిగరెట్లు తీసుకొని డబ్బులు అడిగితే ఆ దుకాణ యజమానిని కొట్టిచంపారు. షాహ్డోల్ జిల్లా కేంద్రానికి 90కి.మీల దూరంలో డియోలాండ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో నలుగురు వ్యక్తులు అరుణ్ సోని అనే వ్యక్తి దుకాణం వద్దకు వెళ్లారు. సిగరెట్లు అడిగారు. అయితే, డబ్బులు ఇవ్వాలని అరుణ్ సోని అడగ్గా.. ఆయనపై దాడి చేశారు. అడ్డుపడిన దుకాణ యజమాని కొడుకులపైనా దాడిచేశారని సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి భవిష్య భాస్కర్ తెలిపారు. ఈ దాడి అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే దుకాణ యజమాని మృతి చెందినట్టు చెప్పారు. ఈ కేసులో మోనుఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్‌లను నిందితులుగా గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.