పాక్‌లో భారీ పేలుడు: ఐదుగురి మృతి

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 20మంది గాయపడ్డారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని ఓ నాలుగంతస్తుల భవనంలో ఈ పేలుడు జరిగినట్టు........

Published : 21 Oct 2020 23:26 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 20మంది గాయపడ్డారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని ఓ నాలుగంతస్తుల భవనంలో ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కరాచీలోని మస్కాన్‌ చౌరంగీ సమీపంలో జరిగిన ఈ పేలుడులో భవనంలోని కనీసం రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్టు గుర్తించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

పేలుళ్లు జరిగిన అనంతరం భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణమేంటనేది మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. ప్రాథమిక విచారణ ప్రకారం భవనంలోని గ్యాస్‌ లీక్‌ కావడం వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని సమాచారం. ఘటనా స్థలంలో పేలుడు కారకాలేమీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.  సింధ్‌ ముఖ్యమంత్రి సయ్యద్‌ మురాద్ అలీ షా ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని