crime news: బాణసంచా గోదాంలో పేలుడు.. ఏడుగురి మృతి

కాంచీపురంలోని ఓ గ్రామంలో బాణసంచా గోదాంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.

Updated : 22 Mar 2023 17:42 IST

చెన్నై: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. కాంచీపురం సమీపంలోని కురువిమలై గ్రామంలోని గోదాంలో జరిగిన  ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. కనీసం తొమ్మిది మందికి పైగా గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. బాణసంచా తయారీతో పాటు స్టోరేజీ సౌలభ్యం ఉండే ఈ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలేమీ తెలియలేదని.. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కాంచీపురం కలెక్టర్‌ ఎం.ఆర్తి మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని