drugs case: నౌకలో ఎన్‌సీబీ మరోసారి తనిఖీలు.. మఫెడ్రోన్‌ స్వాధీనం..

ముంబయి తీరంలోని విలాసవంతమైన నౌకలో ఎన్‌సీబీ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఈ సారి మరో 8 మందిని అదుపులోకి తీసుకొని మఫెడ్రోన్‌ అనే మాదక ద్రవ్యాన్ని

Published : 05 Oct 2021 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి తీరంలోని విలాసవంతమైన నౌకలో ఎన్‌సీబీ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఈ సారి మరో 8 మందిని అదుపులోకి తీసుకొని మఫెడ్రోన్‌ అనే మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. మరోపక్క బాంద్రా, అంధేరీ, లోఖండ్‌వాలా ప్రాంతాల్లో ఎన్‌సీబీ తనిఖీలు నిర్వహించింది. ఒక మాదక ద్రవ్యాల పంపిణీదారుని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. తాజాగా అధికారులు అదుపులోకి తీసుకొన్నవారికి నౌకలో జరుగుతున్న పార్టీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్యన్‌ ఖాన్‌కు న్యాయస్థానం విధించిన ఒక్క రోజు కస్టడీ ముగియనుండటంతో నేడు కిల్లా కోర్టు అడిషనల్‌ చీఫ్ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఎం నిర్లాంకర్‌ ఎదుట హాజరుపర్చారు. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున న్యాయవాది సతీష్‌ మానెషిండే కేసును వాదించనున్నారు. నిన్న అరెస్టు చేసిన 8 మందితో పాటు మరో వ్యక్తిపేరు కూడా ఈ కేసులో చేర్చే అవకాశాలు ఉన్నట్లు ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని