‘నూతన’ వేడుకల్లో అపశ్రుతి: 8మంది మృతి

కొత్త సంవత్సరం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బోస్నియా నైరుతీ ప్రాంతంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న హాలిడే కాటేజ్‌లో విషవాయువు లీక్‌ అయిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు....

Published : 02 Jan 2021 00:46 IST

సారాజేవో‌: బోస్నియా-హెర్జ్‌గోవినాలో కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బోస్నియా నైరుతీ ప్రాంతంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంటున్న హాలిడే కాటేజ్‌లో విషవాయువు లీక్‌ అయిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనం ప్రకారం బోస్నియా రాజధాని సారాజేవోకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోసుస్జే మున్సిపాలిటీ పరిధిలోని ట్రిబిస్టోవో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సుమారు ఉదయం పది గంటల ప్రాంతంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందినట్లు స్థానిక పోలీస్‌ శాఖ అధికారి వెల్లడించారు. పోలీసు సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించగా 8 మంది మృతి మృతదేహాలను గుర్తించామని తెలిపారు. వీరిలో టీనేజర్లు, విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారంతా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు అక్కడ సమావేశమయినట్లు తమ ప్రాథమిక విచారణలో తెలిసిందని సదరు పోలీసు అధికారి తెలిపారు. గది ఉష్ణోగ్రతలను పెంచేందుకు ఉపయోగించే పవర్‌ జనరేటర్‌లోని కార్బన్‌ మోనాక్సైడ్ లీక్‌ అవడంతో వారంతా మృతి చెందినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని