నడికుడి ఎస్‌బీఐలో రూ.85లక్షల చోరీ

గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐలో రూ.85లక్షల సొమ్ము చోరీ జరిగిన కేసులో నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు.

Published : 22 Nov 2020 01:33 IST

గుంటూరు: గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐలో రూ.85లక్షల సొమ్ము చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. ప్రాథమిక సమాచారంతో పాటు చోరీ జరిగిన తీరును పరిశీలిస్తే ఆరితేరిన వారే దొంగతనానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. లాకర్‌ను పగులగొట్టి దొంగలు సొమ్ము ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. నిందితులు అన్నిరకాల రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు ఆయన వివరించారు. లోపలి నుంచి సీసీ కెమెరాల కనెక్షన్‌ను కూడా తొలగించినట్లు చెప్పారు. పోలీసు జాగిలాలు వస్తాయనే అనుమానంతో దొంగలు కారం చల్లినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని