‘రూ.25లక్షలివ్వండి లేదంటే భవనాలు కూల్చేస్తా’

నక్సలైట్‌నంటూ నగరంలోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తిని బెదిరించిన విషయంపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 16 Sep 2020 01:14 IST

నక్సలైట్‌నంటూ వ్యక్తి బెదిరింపులు.. కేసు నమోదు, అరెస్ట్‌

పంజాగుట్ట(హైదరాబాద్‌)‌: నక్సలైట్‌నంటూ నగరంలోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తిని బెదిరించిన విషయంపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పంజాగుట్ట అడ్మిన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో అపర్ణ నిర్మాణ సంస్థ కార్యాలయం ఉంది. ఈనెల 12న మెహిదీపట్నానికి చెందిన నగేశ్ కుమార్ పట్నాయక్‌ అనే వ్యక్తి ఆ కార్యాలయానికి వెళ్లాడు. ఎండీ ఉన్నారా? అంటూ అక్కడున్న సిబ్బందిని అడిగారు. ఎండీ లేరని.. ఏదైనా పని ఉంటే ఏజీఎం సూర్యారావును కలవాలని సిబ్బంది సూచించారు.

ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఈనెల 14న సూర్యారావుకు ఫోన్ చేశారు. తాను నక్సలైట్‌నని.. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో షేక్‌పేటలో నిర్మాణంలో ఉన్న అపర్ణ నిర్మాణ సంస్థకు చెందిన భవనాలను కూల్చివేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై సదరు సంస్థ ప్రతినిధులు సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు.. మంగళవారం మొహిదీపట్నంలో నగేశ్ కుమార్‌ పట్నాయక్‌ను అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని