Crime news: సాంబారు సరిగా లేదని తల్లి, సోదరిని కాల్చి చంపాడు
సాంబారు సరిగా చేయలేదని తల్లి, సోదరిని నాటు తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి. ఈ విషాద ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకా కుడగోడులో చోటుచేసుకుంది.
కార్వార, న్యూస్‌టుడే: సాంబారు సరిగా చేయలేదని తల్లి, సోదరిని నాటు తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి. ఈ విషాద ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకా కుడగోడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజునాథ్ తాగుడుకు బానిస. గురువారం మధ్యాహ్నం తాగిన మత్తులోనే భోజనం చేస్తూ.. సాంబారు పోసుకున్నాడు. అది నచ్చక పోవడంతో ఎందుకిలా చేశారంటూ తల్లి పార్వతి(42), సోదరి రమ్య(19)తో గొడవకు దిగాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఇద్దరినీ కాల్చాడు. స్థానికులు విషయం గ్రహించి పోలీసులకు తెలపగా.. కాల్చిన వెంటనే ఇద్దరూ మృతి చెందినట్లు ఘటనా స్థలం పరిశీలించిన సిద్ధాపుర పోలీసులు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Padma Shri: రూ.20తో పేదలకు వైద్యం..ఎందరికో ఆదర్శప్రాయం
-
General News
Telangana News: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు: తమిళి సై
-
India News
Covid Vaccine: భారత్ బయోటెక్ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్’ విడుదల
-
Sports News
ICC: ఐసీసీ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ 2022.. విజేతలు వీరే
-
General News
Kavitha: సీఎం కేసీఆర్ విజన్ ప్రతిబింబించేలా ప్రసంగించిన గవర్నర్‌కు థ్యాంక్స్: కవిత