పోలీసు వాహనం చోరీకి యత్నం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల వాహనం చోరీకి విఫలయత్నం జరిగింది. అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న యువకులను సీఐ విచారిస్తుండగా ..

Published : 14 Nov 2020 01:28 IST

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల వాహనం చోరీకి విఫలయత్నం జరిగింది. అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఓ వ్యక్తి కారుతో పరారయ్యాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని పోలీసు వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో వాహనం ముందుభాగం ధ్వంసమైంది.

నేరేడు చర్లమండలం ముకుందాపురానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిన్న మిర్యాలగూడ సమీపంలోని ఈదెలగూడెంకు వచ్చి.. తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రే రోడ్డుపక్కన మద్యం సేవిస్తు్న్నాడు. గమనించిన సీఐ రమేశ్‌బాబు వారిని విచారించేందుకు అక్కడికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు వంశీ అక్కడి నుంచి తప్పించుకొని పోలీసు వాహనంతో పరారయ్యాడు. సీఐ వాహనంతో కోదాడ వైపు పారిపోతుండగా.. యాద్‌గార్‌ పల్లి వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సమాచారమిచ్చారు. వెంబడించిన పోలీసులు ఆళ్లగడప టోల్‌గేట్‌ వద్ద వంశీని పట్టుకొని అరెస్టు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని