వివేకా హత్యకేసులో విచారణకు మరో ముగ్గురు

మాజీమంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల కోణంలోని దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది.

Updated : 27 Sep 2020 16:08 IST

కడప: మాజీమంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల కోణంలోని దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇవాళ కొత్తగా ముగ్గురు అనుమానితులు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ముగ్గురూ కడప నగరానికి చెందిన చెప్పుల దుకాణం డీలర్లుగా గుర్తించారు. సీబీఐ అధికారులు ముగ్గురినీ ప్రశ్నిస్తూ వాంగ్మూలం నమోదు చేస్తున్నారు.

 పులివెందులకు చెందిన చెప్పలదుకాణం యజమాని మున్నాను ఐదురోజుల పాటు లోతుగా విచారించిన తర్వాత ఈ ముగ్గురు డీలర్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని