
ఆ ఇంటి వద్ద 60మంది పోలీసులు, సీసీటీవీలు!
హాథ్రస్ ఘటన బాధితురాలి కుటుంబానికి భారీ భద్రత
హాథ్రస్: దేశంలో సంచలనం సృష్టించిన హాథ్రస్ హత్యాచారం కేసులో బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బుల్గర్హి గ్రామంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రతగా 60 మంది పోలీసులు, ఎనిమిది సీసీటీవీ కెమెరాలు ఉంచినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. డీఐజీ షాలాభ్ మాథుర్‌ను లఖ్‌నవూ నుంచి హాథ్రస్‌కు నోడల్ అధికారిగా పంపారు. అవసరమైతే అక్కడ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళా పోలీసులతో పాటు మొత్తం 60 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్టు హాథ్రస్ ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబం, సాక్షులకు పోలీసులు భద్రతగా షిఫ్ట్‌ల్లో పనిచేస్తారని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలతో ఆ ఇంటిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే, ఆ ఇంటి వద్దకు వచ్చేవారికి సంబంధించిన ఓ రిజిస్టర్‌ను కూడా పెట్టినట్టు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.