హోం క్వారంటైన్‌ పేరుతో అత్యాచారం..!

కేరళలో దారుణం చోటుచేసుకుంది. హోం క్వారెంటైన్‌ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించడం కలకలం సృష్టించింది. ఈ ఘటన కేరళలోని పంగోడే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

Published : 08 Sep 2020 01:08 IST

కొచ్చి: కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. హోం క్వారంటైన్‌ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించడం సోమవారం కలకలం సృష్టించింది. ఈ ఘటన కేరళలోని పంగోడే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధులు ముగించుకుని  తన ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఓ ఆరోగ్య అధికారి(హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌) ఆమెను క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.

ఈ నేపథ్యంలో ఆమె యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గానే తేలింది. ఆ పరీక్షల  ధ్రువీకరణపత్రాల్ని తన ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి ఆమెకు సూచించాడు. దీంతో సెప్టెంబర్‌ 3న ఆమె అతడి ఇంటికి వెళ్లగా సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తర్వాతి రోజు వదిలిపెట్టినట్లు మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మహిళా కమిషన్‌ సైతం కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ వైద్య శాఖకు లేఖ రాసింది. నిన్న పథినంతిట్ట జిల్లాలో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ కరోనా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోని రావడం గమనార్హం..

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని