ప్రియుడి కోసం.. భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో ఉండటానికి భార్య భర్తను హత్య చేసిన ఘటన మహారాష్ర్టలో చోటు చేసుకుంది. పుణెకు చెందిన మయూర్‌ గౌక్వాడ్‌, రితుకు రెండేళ్ల కిందట వివాహమైంది. ప్రియుడి మీద ఇష్టంతో భర్తతో ఉండలేక రితు రోజూ మయూర్‌తో

Published : 01 Oct 2020 01:22 IST

పుణె : ప్రియుడితో ఉండటానికి భార్య భర్తను హత్య చేసిన ఘటన మహారాష్ర్టలో చోటు చేసుకుంది. పుణెకు చెందిన మయూర్‌ గైక్వాడ్‌, రితుకు రెండేళ్ల కిందట వివాహమైంది. భర్తను వదిలేసి ప్రియుడి దగ్గరికి వెళ్తానని రితు తన తల్లిదండ్రులకు సైతం చెప్పటంతో వారు సర్ది చెప్పారు. అయినా తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. లాక్‌డౌన్‌ సమయంలో వేరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్న భార్యను భర్త మందలించారు. దీంతో ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించుకోవాలని రితు నిర్ణయించుకున్నారు. నర్సు ఉద్యోగం చేసే మయూర్‌ తల్లి నైట్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో రితు భర్తను చంపాలని పథకం వేశారు. ఘటన జరిగిన సమయంలో మృతుడి సోదరుడు కూడా ఇంట్లో లేరు.
  బుధవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రితు భర్తను హత్య చేశారు. ఏమి తెలియనట్లు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. మయూర్‌ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు మృతుడి సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పారు. ఇంటికి చేరుకున్న సోదరుడు పోలీసులను ఆశ్రయించారు. తను మార్నింగ్‌ వాక్‌ వెళ్లి ఇంటికి వచ్చే సరికి భర్త చనిపోయి పడి ఉన్నట్లు రితు చెప్పారు. అనంతరం పోలీసుల కస్టడిలో ప్రియుడి కోసమే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు.


 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts