ఆమెతో పరిచయం ఖరీదు రూ.80లక్షలు

కన్సల్టెంట్‌ పేరుతో భారీగా మోసానికి పాల్పడిన కిలాడీ లేడీపై  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ రిపేరు కోసం వచ్చిన శ్రీదివ్య అనే

Published : 07 Jun 2021 01:09 IST

విజయవాడ: కన్సల్టెంట్‌ పేరుతో భారీగా మోసానికి పాల్పడిన కిలాడీ లేడీపై  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ రిపేరు కోసం వచ్చిన శ్రీదివ్య అనే యువతి షాపు యజమానిని పరిచయం చేసుకుంది. రోజూ ఫోన్‌ చేస్తూ పరిచయం పెంచుకుంది. తనకు రూ.కోటిన్నర విలువ చేసే పొలం ఉందని.. ప్రస్తుతం రూ.80లక్షల తాకట్టులో ఉందని చెప్పింది. 

ఆ భూమిని విడిపించేందుకు నగదు కావాలని సెల్‌ఫోన్‌ షాపు యజమాని శివకృష్ణకు తెలిపింది. తాకట్టు నుంచి విడిపించిన తర్వాత  పొలం విక్రయిస్తే నగదు వస్తుందని శ్రీదివ్య తెలిపిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విడతల వారీగా రూ.80లక్షలు శ్రీదివ్యకు ఇచ్చానని వాపోయాడు. సోదరుడితో పాటు రజాక్‌ అనే వ్యక్తితో కలిసి ఈ తరహాలోనే మరికొంత మంది వద్ద నగదు తీసుకుని శ్రీదివ్య మోసం చేసినట్టు వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు యువతిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని