డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం..

రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ సుమారు 40 మందికి పైగా అమాయకులను మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. విజన్‌ వన్‌ ఛానల్‌ ఎండీ

Published : 28 Jul 2020 01:47 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ సుమారు 40 మందికి పైగా అమాయకులను మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. విజన్‌ వన్‌ ఛానల్‌ ఎండీ అంటూ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. బాధితులు ఒకొక్కరి నుంచి రూ.1.5లక్షల దాకా వసూలు చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసి  అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుని వద్ద నుంచి రూ.8లక్షల నగదు, నకిలీ ఇళ్ల పత్రాలు, ఐడీ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో నకిలీ ఐడీ కార్డులతో ఎస్సైగా చలామణి అయ్యాడని... ఈ కేసులో విజయవాడలో అరెస్టైనట్లు సజ్జనార్‌ వివరించారు. 

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ మేకల వంశీధర్‌రెడ్డిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘ఇటీవల అల్వాల్ మచ్చ బొల్లారంలో జరిగిన చోరీ కేసులో  ప్రధాన నిందితుడు ఇతను. చోరీ సొత్తును దాచేందుకు సహకరిస్తున్న భార్యతో పాటు ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేశాం. దర్యాప్తులో ఇతను చోరీ చేసిన డబ్బుతో విజయవాడలో ఓ ఇంటిని కొన్నట్లు తెలిసింది. ఇల్లు కొనుగోలు చేసేందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం అటెండర్‌ను కూడా అరెస్ట్ చేశాం. నిందితుని నుంచి రూ.53 లక్షల 35 వేల నగదుతో పాటు 20 తులాల బంగారు ఆభరణాలు, ఓ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 72 చోరీలకు పాల్పడ్డాడు’’అని సజ్జనార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని