నక్సల్స్‌ దాడిలో అమరుడైన కోబ్రా కమాండెంట్‌ 

ఛత్తీస్‌గఢ్​ సుక్మా జిల్లాలో నక్సలైట్లు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్​ కోబ్రా (కమాండో బెటాలియన్​ ఫర్​ రెజల్యూట్​ యాక్షన్​) బలగాలే లక్ష్యంగా మందుపాతర(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ భలేరావు(33) ప్రాణాలు కోల్పోయారు........

Published : 29 Nov 2020 10:06 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్​ కోబ్రా (కమాండో బెటాలియన్​ ఫర్​ రెజల్యూట్​ యాక్షన్​) బలగాలే లక్ష్యంగా మందుపాతర(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ భలేరావు(33) ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా తాడ్‌మెట్ల గ్రామంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో అమర్చిన ఐఈడీని నక్సల్స్‌ పేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని