హాస్యనటి భారతీ సింగ్‌ అరెస్ట్‌

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది.  డ్రగ్స్‌ వినియోగం కేసులో హాస్యనటి భారతీ సింగ్‌ అరెస్టయ్యారు. ఆమె నివాసం, కార్యాలయాల్లో సోదాల అనంతరం భారతీసింగ్‌ దంపతులను........

Published : 22 Nov 2020 01:30 IST

ముంబయి: బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది.  డ్రగ్స్‌ వినియోగం కేసులో హాస్యనటి భారతీ సింగ్‌ అరెస్టయ్యారు. ఆమె నివాసం, కార్యాలయాల్లో సోదాల అనంతరం భారతీసింగ్‌ దంపతులను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులు విచారించారు. ఈ క్రమంలో  వాళ్లిద్దరూ డ్రగ్స్‌ వినియోగించినట్టు అంగీకరించారని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సోదాల సమయంలో వారి ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఓ డ్రగ్‌ వ్యాపారిని విచారించగా ఆమె పేరు బయటకు రావడంతో ఆమె ఇంట్లో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా బాంద్రాలోని ఆమె నివాసంలో 86.5గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముంబయిలోని మరో రెండు చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు.

యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వెలుగుచూసిన ఈ డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు దాదాపు 20 మందికి పైగా ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అలాగే, ప్రముఖ బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులను ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని