‘కంగన, రంగోలిపై కేసులు నమోదు చేయండి’

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలి చందేలాపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన ట్వీట్లు, ఇంటర్వ్యూలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా..........

Published : 17 Oct 2020 17:06 IST

పోలీసులకు ముంబయి కోర్టు ఆదేశం

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలి చందేలాపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన ట్వీట్లు, ఇంటర్వ్యూలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ ముంబయిలోని బాంద్రా మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. కంగన, ఆమె సోదరిపై  కాస్టింగ్‌ డైరెక్టర్‌ సాహిల్‌ అస్రఫ్‌అలీ సయ్యద్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలకు పాల్పడుతున్నారని, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత రెండు నెలలుగా బాలీవుడ్‌ ప్రతిష్ఠను మసకబార్చేలా కంగన వ్యవహరిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

బాలీవుడ్‌కు బంధుప్రీతి, స్వాభిమానం, తదితర అంశాలను అంటగడుతూ ట్వీట్లు చేస్తున్నారని, టీవీ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారని సయ్యద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, ట్విటర్‌లో చాలా అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఆ కామెంట్లు కేవలం తననే కాకుండా అనేకమంది కళాకారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సయ్యద్‌ తెలిపారు. మత భావాల ఆధారంగా కళాకారులను విడగొట్టేందుకు కంగన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆమె సోదరి రంగోలి కూడా మత విద్వేషాలను వ్యాప్తి చేసేలా అభ్యంతరకరమైన ట్వీట్లు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం కంగన, రంగోలిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts