ఆసుపత్రిపై నుంచి దూకి కొవిడ్‌ రోగి ఆత్మహత్య

కొవిడ్‌ ఆసుపత్రి భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 30 Aug 2020 01:51 IST

ఏలూరు నేరవార్తలు: కొవిడ్‌ ఆసుపత్రి భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు(32) ఈ నెల 17న ఆశ్రం కొవిడ్‌ ఆసుపత్రిలో చేరాడు. గత మూడు రోజులుగా రాంబాబు ‘నేను దేవుడు దగ్గరకి వెళిపోతా’ అంటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో  రాంబాబును చూసుకునేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. రాంబాబు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున ‘బై బై.. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా’ అని గట్టిగా అరుస్తూ మూడో అంతస్తు కిటికీలో నుంచి కిందకు దూకాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

 ‘ఆసుపత్రిలో మా కుమారుడి మంచి చెడ్డలు దగ్గరుండి చూసుకుంటున్నాం. బాగానే ఉన్నాడు. నేడో..‌ రేపో డిశ్చార్జి  అయ్యేవాళ్లం’ అంటూ మృతుడి తండ్రి అన్నవరం బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ సీఐ అనసూరి.శ్రీనివాస్, ఎస్సై చావా సురేష్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని