49కి చేరిన భూకంప మృతుల సంఖ్య

టర్కీలో సంభవించిన భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 49కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య సైతం పెరిగింది. ప్రమాదంలో 896 మంది గాయపడినట్లు విపత్తు మరియు...

Updated : 01 Nov 2020 16:08 IST

ఇజ్మిర్‌: టర్కీలో సంభవించిన భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 49కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య సైతం పెరిగింది. ప్రమాదంలో 896 మంది గాయపడినట్లు విపత్తు నిర్వహణ అధికారులు ఆదివారం వెల్లడించారు. భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 5 వేల మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టర్కీలోని ఇజ్మిర్‌ నగరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. భారీ ప్రకంపనలతో గ్రీకు ద్వీపమైన సామోస్‌లో స్వల్ప సునామీ ఏర్పడింది. భూకంపం ధాటికి భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. నిరాశ్రయులైన వేలాది మందికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు