రెండు ఎయిరిండియా విమానాలకు బెదిరింపు

దేశ రాజధాని నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్‌ కలకలం రేపుతోంది. రేపు లండన్‌ వెళ్లాల్సిన రెండు ఎయిరిండియా..........

Published : 04 Nov 2020 20:51 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్‌ కలకలం రేపుతోంది. రేపు లండన్‌ వెళ్లాల్సిన రెండు ఎయిరిండియా విమానాలను ఉద్దేశిస్తూ ఈ బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. లండన్‌లో ఈ రెండు విమానాలను ల్యాండ్‌ కానివ్వబోమంటూ నిషేధిత ఖలిస్థానీ సంస్థకు చెందిన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో దిల్లీ విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దిల్లీ పోలీసులతో పాటు ఎయిరిండియా, విమానాశ్రయ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బందిని మరింతగా మోహరించామని, ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నట్టు విమానాశ్రయ డీసీపీ రాజీవ్‌ రంజన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని