నకిలీ కాల్‌సెంటర్‌పై పోలీసుల దాడి.. 17 మంది అరెస్టు 

దేశ రాజధానిలో నకిలీ కాల్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న 17 మంది సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. యూఎస్‌ఏ, కెనడాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకొని నిందితులు దీన్ని నిర్వహిస్తున్నారు. దిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో ఉన్న కాల్‌సెంటర్‌కు సహిల్‌ దిల్వారీ అనే వ్యక్తి మూడేళ్లుగా యజమానిగా 

Updated : 08 Nov 2020 06:42 IST

న్యూదిల్లీ : దేశ రాజధానిలో నకిలీ కాల్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న 17 మందిని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. యూఎస్‌ఏ, కెనడాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకొని నిందితులు దీన్ని నిర్వహిస్తున్నారు. దిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో ఉన్న కాల్‌సెంటర్‌కు సహిల్‌ దిల్వారీ అనే వ్యక్తి మూడేళ్లుగా యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఆయా దేశాల్లోని ప్రజలకు పాప్‌అప్‌ మెసేజ్‌లు పంపి వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యక్‌ చేయడంతో పాటు ఎలక్ర్టానికి పరికరాలను వైరస్‌కు గురయ్యేలా చేస్తారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌ టెక్నికల్‌ సాయం అందజేస్తామని ఈ ముఠా వాళ్ల నుంచి డబ్బులు దోచుకుంటుందని పోలీసులు తెలిపారు. 

శుక్రవారం ఈ సెంటర్‌పై దాడి చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు 20 కంప్యూటర్లను సీజ్‌ చేశారు. వాటిల్లో లభించిన సమాచారం మేరకు ఈ ముఠా నకిలీ కాల్ సెంటర్‌ ద్వారా గత ఏడాది కాలంలో యూఎస్‌, కెనడాలోని 2268 మందిని మోసం చేశారని పోలీసులు కనుగొన్నారు. వాళ్ల నుంచి రూ. 8 కోట్ల వరకూ వసూలు చేసినట్లు గుర్తించామని సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ డీఎస్పీ అన్యేశ్‌ రాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని