
Updated : 24 Nov 2020 10:51 IST
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
రాజమహేంద్రవరంలో విషాద ఘటన
తాడితోట: రాజమహేంద్రవరం తాడితోట అంబేడ్కర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పిల్లలకు విషమిచ్చి మహిళ, ఆమె తల్లి ఉరివేసుకుని చనిపోయారు. మృతులను సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్ (9), రితిక (7)గా గుర్తించారు. శివపావని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే మనస్తాపంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Tags :