Updated : 15 Oct 2020 12:46 IST

ఇద్దరు కుమారులను చంపిన తండ్రి

కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోయలపల్లెలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. మతి స్థిమితం లేని తండ్రి తన ఇద్దరు కుమారులను చంపి పాతిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బోయలపల్లి గ్రామానికి చెందిన రవి, రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి రవి తన ఇద్దరు కుమారులు సుదీప్‌ (5), సుధీర్‌(7)లను ఇంట్లోనే నిద్రపోతున్న సమయంలో గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం రెండు మృతదేహాలను ఈడ్చుకెళ్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. 

పిల్లలు కనిపించకపోవడంతో తల్లి రాధమ్మ బోరున విలపిస్తూ ఏం చేశావంటూ రవిని గట్టిగా  నిలదీసింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. రవికి గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారమందుకున్న పోలీసలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని