శ్రీశైలంలోని సత్రంలో ఘర్షణ.. వ్యక్తి మృతి

శ్రీశైలంలోని ఓ ప్రైవేటు సత్రంలో భక్తులు, సత్రం సిబ్బంది మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో సత్రం మేనేజర్‌ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కాకతీయ కమ్మవారి సత్రంలో నలుగురు భక్తులు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ కూర్చోనే భోజనం..

Updated : 30 Dec 2020 12:16 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైలంలోని ఓ ప్రైవేటు సత్రంలో భక్తులు, సత్రం సిబ్బంది మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో సత్రం మేనేజర్‌ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కాకతీయ కమ్మవారి సత్రంలో నలుగురు భక్తులు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ కూర్చోనే భోజనం చేస్తామని భక్తులు పట్టుబట్టారు. అయితే అలా తినేందుకు నిబంధనలు ఒప్పుకోవని సత్రం సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావు వారికి చెప్పారు. అది నచ్చని భక్తులు సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావుతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కిందపడిపోయిన శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శ్రీనివాసరావు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధి దండడూడికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని