
కేసు వాపసు తీసుకోనందుకు ఇంటికి నిప్పు
భోపాల్: పోలీసు కేసు వాపసు తీసుకోనందుకు ఇద్దరు దళిత సోదరులపై కొందరు దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాటియా జిల్లాకు చెందిన సందీప్ దోహరె, సంత్రమ్ దోహరె సోదరులకు, పవన్ యాదవ్కు మధ్య గత రెండు సంవత్సరాలుగా డబ్బు చెల్లింపుల విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో దోహరె సోదరుల ఫిర్యాదు మేరకు 2018లో పవన్ యాదవ్పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో కేసు వాపసు తీసుకోవాలని పవన్ యాదవ్ వారిని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు, అతని కుటుంబ సభ్యులు సుమారుగా 15 మంది ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో సందీప్ దోహరె సోదరులపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు వారి ఇంటికి నిప్పంటించారు. వెంటనే చుట్టుపక్కల వారు తేరుకొని అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటనలో నిందితుల మూడు వాహనాలు సైతం కాలిపోయాయి. అనంతరం స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.