హేమంత్‌ హత్య కేసులో 14 మంది అరెస్ట్‌

నగరంలో సంచలనం సృష్టించిన యువకుడు హేమంత్‌ హత్య కేసులో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో హేమంత్‌ భార్య అవంతి బంధువులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. చందానగర్‌కు చెందిన...

Published : 26 Sep 2020 01:16 IST

నిందితుల్లో అవంతి బంధువులు
వెల్లడించిన మాదాపూర్‌ డీసీపీ

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన యువకుడు హేమంత్‌ హత్య కేసులో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో హేమంత్‌ భార్య అవంతి బంధువులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. చందానగర్‌కు చెందిన హేమంత్‌, అవంతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి ఇష్టం లేని అవంతి తల్లిదండ్రులు, బంధువులు అదను కోసం వేచి చూసి పథకం ప్రకారమే కిరాయి హంతకులతో హేమంత్‌ను అపహరించి గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డి.. బుచ్చియాదవ్, మరో ఇద్దరితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో వారితో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు డీసీపీ వివరించారు. అవంతితో పాటు హేమంత్‌ను అపహరించి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్దకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపారు. సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని మరోసారి విచారిస్తామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి..

ప్రేమ వివాహం.. యువకుడి దారుణహత్య

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని