నిఘా విభాగానికి చిక్కిన జీఎస్టీ అక్రమార్కులు

నకిలీ బిల్లులు సృష్టించి రూ.28 కోట్లు జీఎస్టీ రాయితీపొందిన అక్రమార్కులపై ఈనెలలో ఏడు కేసులు నమోదయ్యాయి.

Published : 22 Nov 2020 14:19 IST

అమరావతి: నకిలీ బిల్లులు సృష్టించి రూ.28 కోట్లు జీఎస్టీ రాయితీపొందిన అక్రమార్కులపై ఈనెలలో ఏడు కేసులు నమోదయ్యాయి. గోల్డు బులియన్‌ మార్కెట్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించిన రాకెట్ ముఠా గుట్టును విశాఖపట్నం జీఎస్టీ నిఘావిభాగం అధికారులు రట్టు చేశారు. నకిలీ బిల్లులతో రూ.8కోట్లు జీఎస్టీ రాయితీ పొందిన ఈ ముఠాకు చెందిన కీలకమైన వ్యక్తిని జీఎస్టీ నిఘా అధికారులు అరెస్టు చేశారు.

 ఈ సందర్భంగా గుంటూరు, మంగళగిరి పరిసరాల్లోని వివిధ సంస్థలపై నిర్వహించిన సోదాల్లో రూ.1.58 కోట్ల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వ్యాపారం చేయకుండానే చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించినట్టు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి రూ.28 కోట్లు జీఎస్టీ రాయితీ పొందిన అక్రమార్కులపై నవంబర్‌ నెలలో ఏడు కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పలు సంస్థలు 32 బోగస్‌ సంస్థలు ఏర్పాటు చేసి రూ.400 కోట్ల వ్యాపారం చేసినట్టుగా నకిలీ బిల్లులు సృష్టించాయని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని