Olxలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

గత కొంతకాలంగా ఓఎల్ఎక్స్‌లో వాహనాల నకిలీ ఫొటోలు పెడుతూ పలువురిని మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 11 Oct 2020 01:27 IST

హైదరాబాద్‌: గత కొంతకాలంగా ఓఎల్ఎక్స్‌లో వాహనాల నకిలీ ఫొటోలు పెడుతూ పలువురిని మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్‌పూర్‌కు చెందిన 9 మందిని సీసీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఎనిమిది మందిని వీరు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓఎల్ఎక్స్‌లో ద్విచక్రవాహనాలు, కార్లను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పోస్టులు పెడుతూ పలువురి వద్ద నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు పంపినా బుక్‌ చేసుకున్న వస్తువులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని