Published : 07 Oct 2020 21:21 IST

2.3 కిలోల బంగారం సీజ్‌

మళప్పురం: కేరళలోని కాలికట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి కస్టమ్స్‌ అధికారులు 2.3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 1.65 కిలోల బంగారం ఓ మహిళా ప్రయాణికురాలి లోదుస్తుల్లో గుర్తించారు. అలాగే, 650 గ్రాముల బంగారాన్ని మరో వ్యక్తి బ్యాగులో క్యాప్సిల్స్‌ రూపంలో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. విమాన సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత గల్ఫ్‌ దేశాల నుంచి కేరళలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా బంగారం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts