జేఈఈ స్కామ్ సూత్రధారి అరెస్టు
జేఈఈ మెయిన్స్ కుంబకోణంలో సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ: జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశాల అర్హత పరీక్ష జేఈఈ మెయిన్స్ కుంభకోణం కేసులో సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిందితుడు భార్గవ్ డేకాను అరెస్టు చేశారు. నిందితుడు నగరంలోని ‘గ్లోబల్ ఎడ్యులైట్’ కోచింగ్ సెంటర్ యజమాని అని పోలీసులు తెలిపారు.
ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్‌లో 99.8 శాతం స్కోరు సాధించి, అసోం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన అభ్యర్థి అసలు పరీక్షకే హాజరు కాలేదని మిత్రదేవ్ శర్మ అనే వ్యక్తి అక్టోబర్ 23న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సదరు అభ్యర్థికి బదులు వేరే వ్యక్తి పరీక్ష రాశాడని .. ఇందుకు గాను వృత్తి రీత్యా వైద్యులైన అభ్యర్థి తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు కోచింగ్ సంస్థకు రూ.15 నుంచి 20 లక్షల వరకు చెల్లించారని కూడా ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే అసలు అభ్యర్థి నీల్ నక్షత్ర దాస్, ఆయన తండ్రి డాక్టర్ జ్యోతిర్మయి దాస్, ఇద్దరు టీసీఎస్ ఉద్యోగులు, ఇన్విజిలేటర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు