Published : 19/11/2020 02:08 IST

జర్నలిస్టు దంపతుల పాశవిక హత్య

రాడ్లు, కర్రలతో కొట్టిచంపిన దుండగులు

లఖ్‌నవూ: తమ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించి తిరిగి వస్తుండగానే ఆ జర్నలిస్ట్‌ దంపతులపై దాడి జరిగిన ఉదంతమిది. భార్యాభర్తల ఆర్తనాదాలు అరణ్యరోదనగా మిగిలిన వేళ వారిని రాడ్లు, కర్రలతో కొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. జర్నలిస్ట్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన అతడి భార్య ఆసుపత్రిలో కన్నుమూసింది. భార్యాభర్తల ఫిర్యాదుపై అలసత్వం వహించిన పోలీసులపై అధికారులు వేటువేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలోని కోనె గ్రామంలో చోటుచేసుకుంది.

హిందీ దినపత్రికలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న ఉదయ్‌ పాసవాన్‌కు అతడి గ్రామ పెద్దతో భూమికి సంబంధించి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని గతంలోనూ పోలీసులను ఆశ్రయించిన దంపతులు సోమవారం సైతం స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సాయంత్రం తిరిగి వస్తుండగా దంపతులను అడ్డగించిన దుండగులు వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాపాడాలని భార్యాభర్తలు ఆర్తనాదాలు చేసినా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ దాడిలో ఉదయ్‌ పాసవాన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన అతడి భార్య శీత్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. మృతుల కుమారుడు వినయ్‌ పాసవాన్‌ ఫిర్యాదు మేరకు గ్రామ పెద్ద కేవల్‌ పాసవాన్‌, అతడి భార్య కౌసల్య, కుమారులు జితేంద్ర, గబ్బర్‌, శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వినయ్‌ విలేకర్లతో మాట్లాడుతూ స్వతహాగా రైతు అయిన తన తండ్రి ఉదయ్‌కి కేవల్‌కు మధ్య భూతగాదాలు ఉన్నాయన్నారు. ఈ విషయమై 2016, 2018లో ఇరు పక్షాలపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని తన తండ్రి లఖ్‌నవూలోని ముఖ్యమంత్రి జనతా దర్బార్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు వినయ్‌ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలను సోన్‌భద్ర పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన సూపరింటెండెంట్‌ ఆశిష్‌ శ్రీవాత్సవ జర్నలిస్ట్‌ దంపతుల ఫిర్యాదుపై అలసత్వం వహించిన కోనె పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, ఓ కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ప్రధాన నిందితుడైన గ్రామపెద్ద కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని