
హాథ్రస్ బాధితురాలంటూ ఆమె చిత్రాలు
దిల్లీ హైకోర్టులో వ్యక్తి ఫిర్యాదు
దిల్లీ: తన భార్య చిత్రాలను హాథ్రస్ బాధితురాలంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణించిన తన భార్య చిత్రాన్ని.. హాథ్రస్ సామూహిక హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలిగా ప్రచారం చేస్తున్నారని అజయ్ కుమార్ అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును జస్టిస్ నవీన్ చావ్లా ఏక సభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఆ వ్యక్తి ఆరోపణలు నిజమైతే మూడురోజుల్లోగా ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్‌లకు అవసరమైన సూచనలు చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. ఆ చిత్రం ఎవరిది అనే విషయాన్ని అలా ఉంచితే.. అత్యాచార బాధితురాలి వివరాలను బహిర్గతం చేయటం చట్ట ప్రకారం నేరమని కోర్టు వెల్లడించింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను నవంబరు 9కి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Chandrakant Pandit: మధ్యప్రదేశ్ కెప్టెన్ పెళ్లికి రెండు రోజులే సెలవిచ్చా: చంద్రకాంత్ పండిత్
-
Crime News
Hyd News: చీకటి గదిలో బంధించి చిత్రహింసలు.. కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం
-
General News
GHMC: విధుల్లో నిర్లక్ష్యంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం.. 38 మంది ఇంజినీర్ల జీతాల్లో కోత
-
Movies News
Bunny Vas: ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాత బన్నీవాసు కీలక వ్యాఖ్యలు
-
World News
Editors Guild: మహ్మద్ జుబైర్ అరెస్టును ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
-
India News
ONGC: అరేబియా సముద్రంపై ఓఎన్జీసీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..