టెస్ట్‌ రైడ్‌ చేస్తానంటూ బైక్‌ దొంగతనం..   

రిక్షా నడిపుకునే వ్యక్తి మొబైల్‌ నుంచి సిమ్‌ చౌర్యం చేసిన ఓ వ్యక్తి దాని సాయంతో బైక్‌ను దొంగిలించిన ఘటన కోల్‌కతాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ రాష్ర్టంలోని నార్త్‌ 24 పర్గనాస్‌ జిల్లాకు చెందిన

Updated : 13 Nov 2020 04:21 IST

కోల్‌కతా : రిక్షా నడుపుకొనే వ్యక్తి మొబైల్‌ నుంచి సిమ్‌ చౌర్యం చేసిన ఓ వ్యక్తి దాని సాయంతో బైక్‌ను దొంగిలించిన ఘటన కోల్‌కతాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ రాష్ర్టంలోని నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాకు చెందిన గౌరంగ కిర్తానియా అనే వ్యక్తి.. రిక్షా నడుపుకునే వ్యక్తి సెల్‌ఫోన్‌ నుంచి సిమ్‌కార్డును దొంగిలించాడు. ఆ సిమ్‌ వేసుకొని బైకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఓ వైద్యుడికి ఫోన్‌ చేశాడు. అంతకు ముందు ఈ వైద్యుడు తన ద్విచక్రవాహనాన్ని విక్రయించడానికి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంలో ప్రకటన ఇచ్చారు. 
దీంతో నిందితుడు వైద్యుడికి ఫోన్‌చేసి తాను బైకును కొంటానని ఓ ప్రాంతానికి వైద్యుడిని పిలిపించాడు. నిందితుడు చెప్పిన ప్రదేశానికి గత నెల 2వ తేదీ బైకుతో వెళ్లిన వైద్యుడిని అతను మాటలతో నమ్మించాడు. బైక్‌ను టెస్ట్‌ రైడ్‌ చేస్తానని అడిగాడు. దీనికి వైద్యుడు అంగీకరించడంతో టెస్ట్‌రైడ్‌ అని వెళ్లిన నిందితుడు తిరిగిరాలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. రెండు రోజుల కిందట నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
దర్యాప్తులో భాగంగా రిక్షా నడుపుకునే వ్యక్తిని ఇటీవల నిందితుడు తన వద్ద పనికి కుదుర్చుకున్నాడని తెలిసింది. దీంతో పాటు దొంగిలించిన సిమ్‌ వేసి వైద్యునికి కాల్‌ చేసిన మొబైల్‌ కూడా దొంగిలించిందే అని నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇలా మరొకరి సిమ్‌తో ఫోన్‌ చేస్తే.. బైకు దొంగిలించి పారిపోతే పోలీసులకు దొరకకుండా ఉండొచ్చని నిందితుడు పథకం వేశాడని వారు వెల్లడించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని