చంచల్‌గూడ జైలుకు అ‘ధన’పు కలెక్టర్‌ నగేశ్‌

ఓ రైతు నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేసిన కేసులో అరెస్టయిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకముందు ఆయనకు ..........

Published : 11 Sep 2020 01:36 IST

హైదరాబాద్: ఓ రైతు నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేసిన కేసులో అరెస్టయిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకముందు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి నిందితులకు ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

112 ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ.40లక్షలు తీసుకొని ఐదెకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేలా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో నగేశ్‌తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం అహ్మద్‌, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

రూ.1.12 కోట్ల లంచం... అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని