బీచ్‌లో నగ్నంగా.. నటుడిపై కేసు

గోవా బీచ్‌లో నగ్నంగా పరిగెట్టిన బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్‌ శిక్షకుడు మిలింద్‌ సోమన్‌పై కేసు నమోదైంది. నవంబర్‌ 4న తన పుట్టినరోజు సందర్భంగా దక్షిణ గోవాలోని బీచ్‌లో మిలింద్‌ సోమన్‌ నగ్నంగా...

Published : 08 Nov 2020 02:13 IST

పనాజీ: గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెట్టిన బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్‌ శిక్షకుడు మిలింద్‌ సోమన్‌పై కేసు నమోదైంది. నవంబర్‌ 4న తన పుట్టినరోజు సందర్భంగా దక్షిణ గోవాలోని బీచ్‌లో నగ్నంగా పరుగెట్టిన ఓ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. 55 ఏళ్లు వచ్చినా పరుగెడుతున్నా..’ అంటూ పేర్కొన్నాడు. కాగా ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాగా ఆ ఫొటోపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలతను పెంపొందించే విధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై దక్షిణ గోవా సూపరింటెండెంట్ పంకజ్‌ కుమార్‌ స్పందించారు. మిలింద్‌ సోమన్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉంచిన ఫొటోను నిర్ధారించుకొని అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని