జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం!

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.

Published : 19 Aug 2020 18:31 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్‌ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు ప్రకటించారు. అయితే అతను ఏ సంస్థకు చెందినవాడనే విషయం తేలాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని