బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి నగదు వసూలు 

మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలోని అయోధ్యనగర్‌కు చెందిన ఓ మైనర్‌

Published : 19 Sep 2020 01:12 IST

మేడ్చల్‌ జిల్లాలో ఘటన..

 

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలోని అయోధ్యనగర్‌కు చెందిన ఓ మైనర్‌ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కావటంతో బాలికకు తల్లిదండ్రులు ఫోన్‌ కొనిచ్చారు. ఈ క్రమంలో ఆమె సామాజిక మాధ్యమాలు వినియోగించటం మొదలుపెట్టగా ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది. బాలికతో కలిసి యువకులు టిక్‌టాక్‌ వీడియోలు, ఫోటోషూట్‌లు చేశారు. కొన్ని రోజుల తర్వాత వాటిని అంతర్జాలంలో పెడతామని చెప్పి బాలిక నుంచి ఆ ముగ్గురు డబ్బులు వసూలు చేశారు. ఇంట్లో నుంచి నగదు మాయమవటం గమనించిన కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాలికకు పరిచయమైన ముగ్గురు వ్యక్తులు బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వారు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు