తల్లి సొంత వైద్యం.. మైనర్‌ బాలిక మృతి!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటుచేసుకుంది. దళితకాలనీకి చెందిన ఓ మైనర్‌ బాలిక (16) నెలలు నిండకముందే

Published : 13 Oct 2020 02:01 IST

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటుచేసుకుంది. దళిత కాలనీకి చెందిన ఓ మైనర్‌ బాలిక (16) నెలలు నిండకముందే మృతశిశువుకు జన్మనిచ్చి మరణించింది. తల్లి సొంత వైద్యమే బాలిక మృతికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దళితకాలనీలో నివాసముంటున్న 45 ఏళ్ల ఓ మహిళ కూలి పనులు చేస్తూ కుమార్తెతో జీవిస్తోంది. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. ఈ క్రమంలో ఆ మహిళ కుమార్తె ఒకరి చేతిలో మోసపోయి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల. ఈ విషయం బయటకు తెలియకుండా కన్న తల్లే వైద్యం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సొంత వైద్యం వికటించడంతో ఆ బాలికకు నొప్పులు తీవ్రమయ్యాయి. మృత శిశువుకు జన్మనిచ్చిన తర్వాత బాలిక మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా రెండు మృతదేహాలను గోదావరి తీరంలో ఖననం చేశారు. ఆ ఘటన సోమవారం వెలుగులోకి రావడంతో పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామా నిర్వహించారు. పురపాలక సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని