మైనర్‌పై  అత్యాచారం

తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలికకు ఆశ్రయం ఇచ్చిన బావ కీచకుడిలా వ్యవహరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల

Published : 05 Nov 2020 01:16 IST

భోపాల్‌ : తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలికకు ఆశ్రయం ఇచ్చిన బావ కీచకుడిలా వ్యవహరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఆ రాష్ర్ట రాజధాని భోపాల్‌కు చెందిన ఓ మైనర్‌ బాలిక తల్లిదండ్రులు 2014లో బాలికకు తొమ్మిదేళ్లున్నప్పుడు మృతి చెందారు. దీంతో ఆ మైనర్, ఆమె అన్నను అక్కా, బావ వాళ్ల తమ ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా మైనర్‌ బాలికపై బావ కన్నేశాడు. అప్పటి నుంచి ఏడేళ్లుగా  అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్‌ను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి ప్రబుద్ధుడు ఈ దుర్మార్గానికి పాల్పడేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ వ్యక్తి బాలికను బెదిరించడంతో ఇన్నాళ్లు ఈ విషయం బాలిక ఎవరికీ చెప్పలేదు. 

కొన్నేళ్ల తర్వాత మైనర్‌ వాళ్ల అన్నకు ఉద్యోగం రావడంతో బావ ఇంటి నుంచి బాలిక బయటపడింది. ఈ బాలిక ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి కొన్ని నెలలుగా అక్కడే పని చేస్తోంది. తనపై బావ ఏడేళ్లుగా దారుణానికి పాల్పడిన దుశ్చర్యను మైనర్‌ బాలిక ఇటీవల తన స్నేహితురాలికి చెప్పింది. ఆ స్నేహితురాలి ద్వారా ఈ విషయం స్వచ్ఛంద సంస్థలోని ఓ కార్యకర్తకు తెలిసి బాలికకు ధైర్యం చెప్పారు. స్వచ్ఛంద సంస్థ సాయంతో బాలిక సోమవారం అక్క భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేశారు. 
 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని