సినీఫక్కీలో రూ.80లక్షల మొబైల్‌‌ ఫోన్లు చోరీ

గుంటూరు జిల్లాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మంగళగిరి- గుంటూరు జాతీయ రహదారిపై రూ.80 లక్షల విలువైన మొబైల్‌ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు కంటైనర్‌లో వెళ్తున్న...

Updated : 16 Sep 2020 18:00 IST

గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఘటన

మంగళగిరి: గుంటూరు జిల్లాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మంగళగిరి- గుంటూరు జాతీయ రహదారిపై రూ.80 లక్షల విలువైన మొబైల్‌ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు కంటైనర్‌లో వెళ్తున్న మొబైల్‌ ఫోన్లను దుండగులు దొంగిలించారు. 980 ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన విషయాన్ని తొలుత కంటైనర్‌ డ్రైవర్, క్లీనర్లు గమనించలేదు. వెనుక వస్తున్న ఓ వాహనదారుడు కంటైనర్‌ను ఆపి వెనుక డోరు తెరుచుకుందని డ్రైవర్‌కు తెలపడంతో మొబైల్‌ఫోన్ల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మంగళగిరి సమీపంలోని కాజ టోల్‌గేట్ వద్ద కంటైనర్‌ను డ్రైవర్‌ ఆపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, ఇతర బృందాలతో గాలింపు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాయే ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశాడు. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని ఆయన తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని