నేను సంతోషంగా లేను.. అందుకే చంపేస్తున్నా..
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కి చెందిన ఓ వైద్యురాలు తన భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి..
భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు
నాగ్‌పుర్: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కి చెందిన ఓ వైద్యురాలు తన భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. జీవితంలో సంతోషంగా లేనందువల్లనే ఇలా చేస్తున్నట్లు ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసుల వివరాల ప్రకారం.. వైద్యురాలు సుష్మ రాణె, ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే ఆమె భర్త ధీరజ్(42), ఇద్దరు పిల్లలు (11, 5 ఏళ్లు) కొరాడి ప్రాంతంలో నివసించేవారు. వారితోపాటే వేరే గదిలో ఉంటున్న వైద్యురాలి అత్త బెడ్రూమ్లో ఉన్న వారిని ఎంత పిలిచినా సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె విషయం పోలీసులకు తెలిపింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టగా వారంతా బెడ్రూమ్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ధీరజ్‌తోపాటు పిల్లల మృతదేహాలు బెడ్‌మీద పడి ఉండగా, వైద్యురాలి మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనాస్థలంలో రెండు సిరింజీలతోపాటు ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన జీవితం ఆనందంగా లేనందువల్లే ఇలా చేస్తున్నట్లు సుష్మ సూసైడ్ నోట్లో పేర్కొంది. మొదట విషంతో కూడిన ఆహారాన్ని భర్త, పిల్లలకు తినిపించి, అనంతరం గుర్తు తెలియని ఇంజక్షన్ ఇచ్చి వారిని హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేకపూజలు
-
Politics News
Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత