అబ్దుల్‌ సలాం కేసులో నిందితులకు బెయిల్‌

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులకు కర్నూలు జిల్లా నంద్యాల న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ..

Published : 12 Dec 2020 01:36 IST

నంద్యాల: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులకు కర్నూలు జిల్లా నంద్యాల న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌కు జిల్లా అదనపు జడ్జి మోక సువర్ణరాజు బెయిల్‌ ఇచ్చారు. ఇద్దరికీ రూ.5వేల చొప్పున పూచీకత్తు, రెండు నెలల పాటు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆళ్లగడ్డ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని జడ్జి ఆదేశించారు.

చోరీ కేసులతో తనకెలాంటి సంబంధం లేకపోయినా వేధిస్తున్నారనే మనస్తాపంతో నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్‌ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం సమీపంలో రైల్వేట్రాక్‌పై భార్యాపిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఆ కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

ఇవీ చదవండి..

ఒత్తిడి భరించలేకే.. చనిపోతున్నాం

నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి అరెస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని