4లక్షల నకిలీ కరోనా టెస్టు కిట్ల పట్టివేత 

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో 4లక్షల నకిలీ కరోనా టెస్టు కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేస్తున్న రాజేశ్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని దిల్లీలోని అశోక్‌నగర్‌లోని అతడి నివాసంలో అరెస్టు చేశారు

Published : 30 Sep 2020 01:33 IST

నొయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో 4లక్షల కరోనా టెస్టు నకిలీ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేస్తున్న రాజేశ్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని దిల్లీలోని అశోక్‌నగర్‌లోని అతడి నివాసంలో అరెస్టు చేశారు. తమ కంపెనీ పేరుతో కొందరు నకిలీ లేబుళ్లు, కరోనా కిట్లను తయారు చేసి మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని అసలు కంపెనీ ప్రతినిధి సోమవారం ఫిర్యాదు చేశారని సెక్టార్‌ 20 పోలీసులు తెలిపారు. దీంతో సోదాలు చేపట్టి సెక్టార్‌ 7 ప్రాంతంలో రహస్యంగా నకిలీ కరోనా కిట్లను తయారు చేస్తున్న కంపెనీని గుర్తించామన్నారు. దాదాపు 3.97లక్షల నకిలీ యాంటీబాడీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తయారీదారుపై కేసులు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని