రూ.2.5 కోట్ల విలువైన పార్టీ డ్రగ్స్ పట్టివేత

భారీ కంజైన్‌మెంట్లలో నిల్వ ఉంచిన పార్టీ డ్రగ్‌, యాబా ట్యాబ్లెట్లను కోల్‌కతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో..

Published : 26 Jul 2020 02:55 IST

కోల్‌కతా: పార్టీ డ్రగ్స్‌గా వ్యవహరించే యాబా ట్యాబ్లెట్లను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తుండగా కోల్‌కతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీటిని బంగ్లాదేశ్‌కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్టయిన వారి నుంచి 50 వేల ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. 

బీఎస్ఎఫ్ దళాలు పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన తరువాత 2019 నుంచి యాబా ట్యాబ్లెట్ల అక్రమ రవాణా పెరిగింది. దక్షిణ బెంగాల్‌లోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా ఈ వ్యాపారం జోరందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మణిపూర్‌కు చెందిన ఇద్దరు మాదకద్రవ్యాల డీలర్లను దక్షిణ కోల్‌కతాకు చెందిన ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.3 కోట్ల విలువైన యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని