ఏపీ మంత్రి స్వగ్రామంలో పేకాట:33మంది అరెస్ట్‌

ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

Published : 28 Aug 2020 01:10 IST

రూ.5.44లక్షల నగదు, 40 వాహనాలు స్వాధీనం

చిప్పగిరి(కర్నూలు): ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 40 వాహనాలు, రూ.5.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం కర్నూలు నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ అనుచరులు పోలీసులపై ఎదురు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న 33 మంది పేకాట రాయుళ్లు పరారవుతుండగా వారిని పట్టుకొని చిప్పగిరి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు స్పెషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ గౌతమిశాలి తెలిపారు. స్వాధీనం చేసుకున్న 40 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆమె వెల్లడించారు. ఈ దాడుల్లో ఒక సీఐ, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని