హేమంత్‌ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్‌కుమార్‌ పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు

Published : 22 Oct 2020 01:17 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్‌కుమార్‌ పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 12 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. సుపారీ ముఠాకు చెందిన మరో ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని యుగేంధర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరితో పాటు బిచ్చు యాదవ్‌, మహ్మద్‌ పాషా అలియాస్‌ లడ్డు, ఎరుకల కృష్ణలతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు.. అభియోగ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో దోషులకు వెంటనే శిక్ష పడేలా చూస్తామని మాదాపూర్‌ ఇన్‌ఛార్జ్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఇద్దరు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్లకు కొవిడ్‌ సోకడంతో రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారని డీసీపీ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని